
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అప్పటికే విషాదంలో మునిగి ఉన్నా ఓ కుటుంబానికి మరో ఘటన తీవ్రంగా కలచి వేసింది..కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకోవడంతో అతని అంత్యక్రియల కోసం కుటుంబం మొత్తం స్వగ్రామంకు వెళ్లగా ఇచ్చోడలో తాళం వేసి ఉన్న మృతుని ఇంట్లో అదే ఆదనుగా దొంగలు పడ్డ ఘటన కలకలం రేపింది… ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనిలో నివాసం ఉంటున్న జాధవ్ దేవిదాస్ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు..దీంతో ఆయన అంత్యక్రియల కోసమై మృతుని స్వగ్రామమైన సొనాలా మండలం లోని ఘన్పూర్ గ్రామానికి కుటుంబసభ్యులందరు వెళ్లగా,ఇచ్చోడలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గమనించిన దుండగులు తాళం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు..ఇంట్లో ఉన్న 20 తులాల వెండి, ఒక తులం బంగారం, పదివేల నగదు చోరికి గురైనట్లు కుటుంబసభ్యుల చెబుతున్నారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.