ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రోజు రోజుకు కోతుల బెడద తీవ్రమవుతుంది..రోడ్డు పై నడిచే వారిపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తు,భీభత్సం సృష్టిస్తున్నాయి కోతులు..తాజాగా రంజాన్ పూర కాలనీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలిక పై కోతులు దాడి చేసి గాయపర్చాయి..కోతుల దాడితో భయంభ్రంతులకు గురైన బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు కోతులను బెదరగొట్టి తరిమివేశారు..గాయలతో అక్కడే కొంతసేపు విలవిలలాడింది బాలిక.. బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కాలనీవాసులు..ఇక అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో కోతుల దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి…కోతులను నియంత్రించి, కోతుల బెడద నుండి తమను కాపాడాలని కోరుకుంటున్నారు కాలనీ వాసులు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.