ఇప్పటికే ఆర్ఐ హుస్సేన్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
ఫోర్జరీతో ఓటు హక్కును బదిలీ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు..
కేసుకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు…

జిల్లాలో సంచలనంగా మారిన ఇచ్చోడ ఓటు హక్కు మార్పిడి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు..తాజాగా కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు ఇచ్చోడ సిఐ బి. రాజు.. అయన తెలిపిన వివరాల ప్రకారం “తేదీ 25/8/2025 రోజున ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కధం వనిత ,కదం సుభాష్ ల ఓట్లను అడగం బి గ్రామం నుండి వారి ప్రమేయం లేకుండా ఇచ్చోడా గ్రామానికి బదిలీ అయ్యాయని మండల తహసిల్దార్ సత్యనారాయణరావు ఇచ్చోడా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగ ఫోర్జరీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు..అయితే విచారణ భాగంగా తేది 27/08/2025 రోజున నిందితులను పట్టుకొని విచారించగా వారు కదం విశాల్, సిందే అచ్యుత్, కదం ధనరాజ్ నకిలీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తయారుచేసి ఎలక్ట్రోరల్ పోర్టల్ లో FORM -8 లో అప్లయ్ చేసి రెవెన్యూ అధికారుల సహాయంతో ఓటు హక్కు అడగాం – బి గ్రామం నుండి ఇచ్చోడ గ్రామం కు మార్చడం జరిగిందని విచారణలో తెలిసిందని.. ఇందుకు సహకరించిన ఇచ్చోడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుస్సేన్ ను కూడా నిందితుడుగా చేర్చి, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు…ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలపడం జరుగుతుందని ఇచ్చోడ సీఐ బి రాజు ఒక ప్రకటనలో తెలిపారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

