More
    HomeUncategorizedఎనిమిది పదుల వయస్సులో పట్టు సడలని సంకల్పం..

    ఎనిమిది పదుల వయస్సులో పట్టు సడలని సంకల్పం..

    80 ఏళ్ల వయస్సులో ద్విచక్ర వాహనం నేర్చుకుంటు, ఆశ్చర్య పరుస్తున్న వృద్ధుడు…

    బండి నేర్చుకుంటున్న గంగారాం..

    అక్షరాలా ఎనభై సంవత్సరాల వయస్సులో పట్టు వదలని విక్రమార్కుడిలా నూతనుత్తేజంతో ద్విచక్ర వాహనాన్ని నేర్చుకుంటున్న ఈయన పేరు గేడం గంగారాం…ఈయనది ఆదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండలం వాగ్దారీ గ్రామం… ఎనిమిది పదుల వయస్సులో సైతం తనకున్న అయిదు ఎకరాలలో వ్యవసాయం చేస్తున్న గంగారాం వయస్సు దృష్ట్యా నడుస్తూ చేనుకు వెళ్లడం ఇబ్బంది మారుతుంది, దీంతో ద్విచక్ర వాహనంపై అయితే సులభంగా రాకపోకలను సాగించవచ్చని అనుకున్నాడు, అనుకున్నదే తడువుగా సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఎక్సెల్ ను కొనుగోలు చేసి, ఎవరి సహాయం లేకుండా ఒంటరిగానే ఎనిమిది పదుల వయస్సులో టీవీఎస్ ఎక్సెల్ నేర్చుకుంటున్నాడు…వాగ్దారీ రోడ్డు పై తడబడుతూ టీవీఎస్ ఎక్సెల్ నడపడం సాధన చేస్తూ కనిపించిన గంగారాం ను పలకరించగ..“నా చేనుకు నడుచుకుంటూ వెళ్లడం కష్టతరం అవుతుంది, ద్విచక్ర వాహనం ఉంటే సులభంగా చేనుకు రాకపోకలను కొనసాగించవచ్చు, అంతే కాకుండా యూరియా బస్తాలవంటి బరువులను సైతం సులభంగా తీసుకెళ్లొచ్చు అనుకుని సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఎక్సెల్ ను కొనుగోలు చేశాను.. నాకు ఇది వరకు ద్విచక్ర వాహనం నడపడం రాదు.. రెండు రోజులు సాధన చెస్తే అదే వస్తుంది అనే సంకల్పం తో సాధన చేస్తున్నాను, ఇప్పుడు దాదాపు నేర్చుకున్నాను, నేర్చుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే వయస్సు అడ్డం వస్తుందా చెప్పండి “ అంటూ చెప్పుకొచ్చారు గంగారాం..


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    spot_img
    Message Us