
ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ రెండురోజుల పసిపాపపై తెగిపడ్డ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది… మండలం లోని కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ రెండు రోజుల క్రితం గుడిహత్నూర్ ప్రాథమిక ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది… అయితే ఈ రోజు ఉదయం తల్లి, పాప ఉన్న బెడ్ పై ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది.. ఈ ఘటనలో పాపకు గాయాలు కాగ, చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు వైద్య సిబ్బంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.