రేపు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ముందుకు ప్రతిపాదనలు..
జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ సాహస క్రీడల ఆమోదంకు ఒక్క అడుగు దూరం..

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన పొచ్చరా జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలను అధికారులు వేగవంతం చేశారు.. పొచ్చర జలపాతం వద్ద వర్షాకాలంలో రివర్ రాఫ్టింగ్,వర్షాకాలం అనంతరం ప్రవాహం నెమ్మదించిన తరువాత కయాకింగ్ నిర్వహించేందుకు అటవీ అధికారులు చేసిన ప్రతిపాదనలపై రేపు డిస్టిక్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (DTPC ) సభ్యులు సమావేశం కానున్నారు.. రేపు సమావేశం నేపథ్యంలో ఈ రోజు జలపాతం వద్ద రాఫ్టింగ్ ను విజయవంతంగా పరీక్షించారు అధికారులు… పొచ్చర జలపాతం వద్ద నుండి కుప్టి వరకు 6 కిలోమీటర్ల దూరాన్ని ఒకటిన్నర గంటల సమయం రాఫ్టింగ్ చేస్తూ చేరుకున్నారు పరీక్షకులు, అధికారులు…పొచ్చరా జలపాతం వద్ద రాఫ్టింగ్ ట్రయల్ విజయవంతంగా పూర్తి కావడంతో రేపు జిల్లా కేంద్రంలో జరగబోతున్న డిస్టిక్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ (DTPC ) సమావేశంలో జలపాతం వద్ద రాఫ్టింగ్ క్రీడలకు కౌన్సిల్ సభ్యుల ఆమోదం కోసం మార్గం సుగుమం అయింది…రాఫ్టింగ్ తో పాటు ఎన్నో సాహస క్రీడలను పొచ్చార జలపాతం వద్ద అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.. దీంతో సమీప భవిష్యత్తులో పొచ్చర జలపాతం అడ్వెంచర్ హబ్ గా మారనుంది…ఇక జలపాతం వద్ద సాహస క్రీడలను ప్రారంభించేందుకు బోథ్ FRO ప్రణయ్ ప్రత్యేక చొరవను చూపుతున్నారు.. ఈ రోజు సైతం రాఫ్టింగ్ ట్రయల్ లో స్వయంగా పాల్గొని పరీక్షించారు ప్రణయ్.. ఈ రోజు జరిగిన పరీక్షలలో బోథ్ అటవీ అధికారి ప్రణయ్ తో పాటు ఇంద్రవెల్లి FRO సంతోష్,కోయినా అడ్వెంచర్, రివర్ రాఫ్టింగ్ సభ్యులు పాల్గొన్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

