ఇచ్చోడా మండలం నర్సాపూర్ గ్రామంలో వెలుగు చూసిన ఘటన..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.. గ్రామంలో నందబాయి w/o సంతోష్ అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అసలు లబ్దిదారు కాకుండా అదే పేరు కలిగిన మరొకరు ఇంటి నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది… పంచాయతీ సెక్రటరీ చొరవతోనే ఈ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది… అసలు లబ్దిదారు భర్త సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ భార్య నందబాయి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఆ విషయం తమకు తెలుపకుండా అదే పేరు గల మరొకరితో పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణం చేపించారాని,మొదటి దశ ఇంటి నిర్మాణ బిల్లు మంజూరు కాగానే అసలు లబ్దిదారు అయినా నా భార్య నందబాయి ను బ్యాంకుకు పంచాయతీ సెక్రటరీ తీసుకెళ్లి అకౌంట్ లో పడ్డ లక్ష రూపాయలను ఇంటి నిర్మాణం చేపట్టిన వారి అకౌంట్ లోకి బదిలీ చేయించారాని తెలిపారు.. ఈ విషయం మా కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో పంచాయతీ సెక్రెటరీని నిలదీయగా బదిలీ చేసిన లక్ష రూపాయలను అయిదు రోజులలో చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి, తరువాత మాట మార్చడని చెప్పుకొచ్చారు.. అయితే ఇదే విషయమై ఇచ్చోడ ఎంపీడీఓ ను వివరణ కోరగా ఒకరి పేరిట మంజూరైనా ఇల్లు మరోకరు కట్టుకున్న మాట వాస్తవమని, అయితే ఇద్దరి పేరు ఒకటే కావడంతో తప్పిదం జరిగినట్లుందని, ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయం నుండి వివరణ కోరారరని, విచారణ చేసి నివేదికను అందిస్తామని తెలిపారు ఎంపీడీఓ… అయితే అసలు లబ్ధిదారు కాకుండా మరొకరు ఇంటి నిర్మాణం చేపట్టడం , మొదటి దశను పూర్తి చేసుకోవడం ఎలా సాధ్యమైందని, మొదటి దశకు సంబంధించిన బిల్లులు ఎలా మంజూరు అయ్యాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి..బిల్లు మంజూరుకు లబ్దిదారులు తప్పకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఫోటో దిగవల్సి ఉంటుంది, ఫోటోలు దిగితే తప్ప బిల్లులు మంజూరు కావు అసలు లబ్ధిదారులు ఫోటో దిగనిదే బిల్లులు ఎలా మంజూరు అయ్యాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

