ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సంచలనంగా మారిన వరుస చోరీలకు సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇప్పటికే క్లూస్ టీమ్ సహాయంతో చోరీ జరిగిన ఇళ్లలో ఆధారాలు సేకరించిన పోలీసులు దొంగలను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. అయితే సాయినగర్, విద్యానగర్ కాలనీలలో చోరికి పాల్పడ్డ దుండగుల దృశ్యాలు కాలనిలో ఉన్న సీసి కెమెరాలలో రికార్డు అయ్యాయి..సీసి కెమెరాలలో రికార్డు అయినా దృశ్యాల ప్రకారం ముగ్గురు దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది.. విద్యానగర్ కాలనీలో వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చిన దుండగులు, దొంగతనం పూర్తి చేసుకుని సంతోషి మాత ఆలయం వద్ద ఉన్న ద్విచక్ర వాహనం అపహారించి దానిపై ఊరి చివర వరకు వెళ్లి ఆ ద్విచక్ర వాహనాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద వదిలి వెళ్లినట్లు తెలుస్తుంది.. అయితే మొత్తం మూడు ఇళ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు మొత్తం 3 తులాలు వరకు బంగారం, 20 తులాల వెండి, లక్షన్నరా నగదు చోరీ గురైనట్లు బాధితులు చెబుతున్నారు … సీసి ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.