
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచేల్మా అటవీ ప్రాంతంలో రోజు రోజుకు పోడురగడ నివురుగప్పిన నిప్పులా మారుతుంది..బాబ్జిపేట్ బీట్ పరిధిలోని 172,174 కంపర్ట్మెంట్ లలోని పోడుభూములలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న అటవీ అధికారులను కేశవపట్నం గ్రామస్థులు చెల్కగుడ వద్ద అడ్డుకున్నారు.. సంవత్సరాలుగా సాగు చేస్తున్న ఆ భూములను తామేవని కేశవపట్నం గ్రామాస్థులు పట్టుబట్టగా, అవి అటవీ భూములని, ఎట్టి పరిస్థితుల్లోను మొక్కలు నాటి తీరుతామని అటవీ అధికారులు స్పష్టం చేశారు..మధ్యాహ్నం వరకు ఇటు అధికారులు, అటు గ్రామస్థులు ఎవరు వెనక్కు తగ్గకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి…ఘటన స్థలానికి చేరుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఉన్నతధికారులతో మాట్లాడి అటవీ అధికారులను వెనక్కి పంపించడంతో పరిస్థితి సద్దుమనిగింది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

