పోలీసులమంటూ బెదిరిస్తు, డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గట్టురట్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు..

“నేను ఇచ్చోడ ఎస్సై నర్సిరెడ్డి ని మాట్లాడుతున్నాను, మీరు గతంలో దొంగ బంగారం కొన్న వివరాలు మా దగ్గర ఉన్నాయి.. మీపై కేసు నమోదు కావద్దంటే అడిగినంత ఫోన్ పే లేదా, గూగుల్ పే చేయండి ” అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారులను బెదిరిస్తు, 18 లక్షల రూపాయల వరకు వసూలుకు పాల్పడిన ముఠాను చాక చక్యంగా పట్టుకున్నారు జిల్లా పోలీసులు…ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు…అయన తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన షేక్ ఇర్ఫాన్(24), చింతలచెరువు ప్రశాంత్ (24),బదనాపురి అజయ్ (29),బొప్పం సుధాకర్ (28) అను వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి దొంగ బంగారం పేరిట జ్వెలరి షాపుల యజమానులకు ఇచ్చోడ ఎస్సై పేరిట ఫోన్ లు చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూండగా,అనుమానం వచ్చిన ఇద్దరు వ్యాపారులు నిర్ధారణ చేసుకునేందుకు ఇచ్చోడ ఎస్సై అధికారిక ఫోన్ నంబర్ తెలుసుకుని, ఫోన్ చేయడంతో ఈ విషయం జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది.. బాధితుల పిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో అయిదుగురి పై రెండు కేసులు నమోదు కాగా నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు, మరొ నిందితుడు వోట్కూరి నరేష్ పరారిలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు… ఎవరైనా పోలీసుల పేరిట బెదిరింపులకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, డబ్బులు పంపి మోసపోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.