
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో దొంగలు హడలెత్తించారు ఒకే రోజు మూడు చోట్ల చోరికి పాల్పడ్డారు.. మండల కేంద్రంలోని సాయినగర్ కాలనిలో మృతుని ఇంట్లో చోరికి జరగగా అదే సమయంలో విద్యానగర్ కాలనిలో ఓ పోలీసు ఇంట్లో సైతం చోరీ జరగడం, మరో చోట ద్విచక్ర వాహనం చోరికి గురవడం కలకలం రేపుతుంది.. కాలనీవాసుల కథనం ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఊరికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసుందని గమనించిన దుండగులు చోరికి పాల్పడ్డారు.. అయితే ప్రస్తుతం వారు లేకపోవడంతో ఎంత మేరకు దొంగతనం జరిగిందనే వివరాలు తెలియరాలేవు..మరో చోట సంతోషి మాత ఆలయం వద్ద ఓ ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనం సైతం చోరికి గురైంది.. అదే ద్విచక్ర వాహనం తో దొంగలు ఉడాయించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఒకే రోజు మూడు చోట్ల చోరీలు కావడం తో అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు…సాయినగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డ జాధవ్ దేవిదాస్ అనే మృతుని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం స్వగ్రామంకు వెళ్లగా తాళం వేసి ఉన్నా వారి ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డ విషయం తెలిసిందే…అయితే మూడు చోట్ల దొంగతనం చేసింది వేరు వేరు దుండగుల లేద మూడు చోట్ల వారే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.