More
    HomeUncategorizedడీజే,బ్యాండ్ బాజాలు వద్దు, భజన సంకీర్తనలే ముద్దు...

    డీజే,బ్యాండ్ బాజాలు వద్దు, భజన సంకీర్తనలే ముద్దు…

    ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వినాయక నిమజ్జన శోభాయాత్రలు…

    భజన, సంకీర్తనల వైపు గ్రామాల మొగ్గు,పల్లెల్లో పెరుగుతున్న ధోరణి….

    ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గేర్జం గ్రామం..మంగళవారం వినాయక నిమజ్జన శోభాయాత్ర నడుస్తుంది… డీజే హోరు లేదు, బ్యాండ్ బాజాలా చప్పుల్లు లేవు..సంఘటీతమై గ్రామస్తులు పాడుతున్న భజన పాటలు, లయబద్ధమైనా మృదంగ శబ్దం, అందుకు అనుగుణంగా వినసొంపైన తాళాల చప్పుల్లు, ఆ శబ్దాలను అనుసరిస్తూ యువకులు చేస్తున్న నృత్యాలు.. ఆహా.. రెండు కళ్ళు చాలవు అత్యద్భుతమైన ఆ దృశ్యాన్ని చూడటానికి.. సాక్షత్తు సకల దేవతలు భువికి దిగి వచ్చి ఆ శోభాయాత్రను చూసేందుకు ఆసక్తి కలిగించేంత ఆద్యంతం శోభాయమానంగా, ఆహ్లాదభరితంగా సాగింది నిమజ్జన శోభాయాత్ర…ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఇదొక్క ఊరే కాదు చాల వరకు గ్రామాలు డీజే,బ్యాండ్ బాజాలా హోరు లేకుండా వినసొంపైన భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జనాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి…

    గేర్జాం గ్రామంలో నిమజ్జన శోభాయాత్రలో భజన సంకీర్తనలతో నృత్యలు చేస్తున్న గ్రామస్థులు..

    డీజే చప్పుళ్లు.. బ్యాండ్ బాజాలు.. అదిరిపోయే స్టెప్పులు..ఇది ప్రస్తుతం వినాయక నిమజ్జనం తీరు.. కాని ఇది మన సంస్కృతి కాదని ఇది ఏ మాత్రం సంప్రదాయబద్దం కాదని అంకితభావం తో కూడిన భక్తితో మనసారా దేవుని స్మృతిస్తూ ఆద్యంతం భక్తి భావంతో భజన సంకీర్తనలు చేస్తూ సాంప్రదాయా ఆధ్యాత్మిక వినోదాన్ని పంచుతూ వినాయక నిమజ్జనంను నిర్వహిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాయి పలు గ్రామాలు… 

    స్వాతంత్రోద్యమంలో భారతీయులను ఏకతాటిపై తీసుకురావాలనే సంకల్పంతో మొదలైన వినాయక ఉత్సవాలు ప్రస్తుతం పల్లెపల్లెన, వాడ వాడన విస్తరించింది..ప్రస్తుతం ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో వినాయక మండపాలను ఏర్పాటు చేసేంత ఆసక్తిని చూరగొన్నాయి ఈ ఉత్సవాలు  ..ప్రతి ఏటా వినాయక ఉత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి..వినాయక మండపాలు ప్రజలను సంఘటితం చేసేందుకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.. తొమ్మిది రోజుల పాటు పల్లెల్లు, పట్టణాలు ఆధ్యాత్మిక  శోభను సంతరించుకుంటున్నాయి.. అయితే వినాయక నిమజ్జనంలో హోరెత్తించే డీజేలు,గుండెలు అదిరేలా బ్యాండు బాజాలా శబ్దాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి..ఇదే సందర్భంలో మరో వైపు యువత తాత్కాలిక వినోదాన్ని ఆస్వాదించడం కోసం చెడు వ్యాసనాల పట్ల ఆసక్తి చూపడం, మత్తు పదార్థాలను స్వీకరించి నిమజ్జన శోభాయాత్రలో నానా హంగామా చేయడం తలనొప్పిగా మారింది అయితే ఈ పరిణామాల పట్ల అప్రమత్తమయినా పలు గ్రామాలు వినాయక నిమజ్జన శోభాయాత్రను భజన సంకీర్తనలతో ఎంతో  శోభాయమానంగా నిర్వహిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాయి..

    మూడు సంవత్సరాల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ప్రారంభించారు…” పర్యావరణ్ హిత్, డీజే ముక్త్ ” నినాదంతో  ఇటు పర్యావరణహితంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి,డీజే లేకుండా భజన సంకీర్తనలతో నిమజ్జనం చేసి ఉత్సవాలను నిర్వహించారు.. ఈ ఉత్సవాలలో పాల్గొన్న వైష్ణవ సంత్ శ్రీ నారాయణ్ మహారాజ్ అయ్యప్ప ఆలయ కమిటీ గొప్ప ఉద్దేశ్యాన్ని ప్రశంశించారు..పలు గ్రామాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో “పర్యావరణ్ హిత్ – డీజే ముక్త్ ” వినాయక ఉత్సవాల గురించి వివరిస్తూ వచ్చారు ఫలితంగా నెమ్మదిగా గ్రామాలలో మార్పు ప్రారంభమైంది.. గత మూడు సంత్సరాలుగా ఇచ్చోడ మండలంలోని ఎన్నో గ్రామాలు “పర్యావరణ్ హిత్ – డీజే ముక్త్ ” వినాయక ఉత్సవాల వైపు వడి వడిగా అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు..  డీజే పాటల హోరు, బ్యాండ్ బాజాల జోరు కంటే భజన సంకీర్తనలతో నిర్వహించే శోభాయాత్రలే మరింత వినోదాత్మకంగా ఉంటుందని ఒక్కసారి ఈ పద్ధతిలో నిమజ్జనం చేసి చుస్తే అందులోని మాధుర్యం తెలుస్తుందని చెబుతున్నారు భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జనానీ నిర్వహించే గ్రామస్థులు..

    భజన సంకీర్తనలతో నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్న అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు..

    సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలి – సంత్ శ్రీ నారాయణ్ మహారాజ్

    వైష్ణవ సంత్ శ్రీ నారాయణ్ మహారాజ్..

    సనాతన హిందూ ధర్మం సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించేలా వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఉండాలని నారాయణ్ మహారాజ్ చెబుతున్నారు.. సనాతన ఉత్సవం అయినటువంటి వినాయక ఉత్సవాలలో పాశ్చాత్య సంస్కృతి చొప్పించి డీజే ల వద్ద నృత్యాలు చేయడం ఆమోదయోగ్యం కాదని ఆలోచనలు మార్చి సనాతన ధర్మం ను అనుసరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు..భజన సంకీర్తనలు చేస్తూ దేవుని స్మృతిస్తూ వినాయక నిమజ్జన శోభాయాత్ర చేయడం క్రమశిక్షణను కనబర్చడమే కాకుండా ఆద్యంతం ఆధ్యాత్మిక వినోదాన్ని కూడ పంచుతుందని తెలిపారు..ప్రస్తుతం పరిస్థితులలో మార్పు వస్తుందని భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్న గ్రామాల సంఖ్య పెరగడం సంతోషకరమని అన్నారు సంత్ శ్రీ నారాయణ్ మహారాజ్..

    “పర్యావరణ హిత్ -డీజే ముక్త్ ” నినాదమే  లక్ష్యంగా వినాయక ఉత్సవాలు- చెన్నెలా మల్లేశ్వర్ రెడ్డి, ఇచ్చోడ అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు..

    చెన్నాల మల్లేశ్వర్ రెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు, ఇచ్చోడ.

    ప్రస్తుతం వినాయక నిమజ్జన శోభయాత్ర ను కొంతమంది యువత  వినోద మార్గంగా చూడటం బాధాకరం.. అలాంటి ఆలోచనలలో మార్పు రావాలనే గొప్ప సంకల్పంతో మూడు సంవత్సరాల క్రితం ఇచ్చోడ అయ్యప్ప ఆలయంలో “పర్యావరణ్ హిత్ -డీజే ముక్త్”నినాదంతో వినాయక ఉత్సవాలను నిర్వహించాం..ఆద్యంతం ఆకట్టుకునేలా భజన సంకీర్తన లతో నిమజ్జన శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించగలిగాం.. ఆ ప్రభావంతో పరిసర గ్రామాలు సైతం ఆ సంవత్సరం నుండి భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జనం నిర్వహించడం ప్రారంభించారు ఆ సంఖ్య క్రమేపి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి..

    భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం అవధులు లేని ఆనందాన్ని  ఇచ్చింది-జుర్రెవార్ దీపక్, గ్రామస్తుడు, గేర్జాం..

    జుర్రెవార్ దీపక్, గ్రామస్తుడు, గేర్జం.

    ఎప్పటిలా డీజేపాటలతో కాకుండా ఈ సారి భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జనాన్ని నిర్వహించాలని గ్రాస్తులందరం నిర్ణయించుకున్నాం అందుకు అనుగుణంగా సమీప గ్రామాల నుండి భజనకారులను పిలిపించి భజన సంకీర్తనలతో వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్వహించం..ఎలాంటి మత్తు పదార్థాలకు తావు లేకుండా క్రమశిక్షణతో ఆద్యంతం భక్తి శ్రద్ధలతో భజనలు ఆలపిస్తూ మృదంగం, తాళల వినసొంపు శబ్దాలతో నిర్వహించిన వినాయక నిమజ్జనం గ్రామస్థులనే కాకుండ పరిసర గ్రామస్థులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది.. అనుభవ పూర్వకంగా చెబుతున్నాము మనస్సు కేంద్రికరించి, దేవుణ్ణి స్మృతిస్తూ చేసే భజనలు, భక్తి భావం తో కూడిన నృత్యాలు డీజే పాటలపై చేసే నృత్యాల కంటే చాల ఆహ్లాదంగా, వినోదభరితంగా ఉంటాయి.. దీనితో గ్రామంలో ఎలాంటి గొడవలకు ఆస్కారం ఉండదు.. దేవుడిని ఆరాధంచే అత్యత్తమ పధ్ధతి ఇది అని చెప్పుకొచ్చారు గేర్జాం గ్రామానికి చెందిన జుర్రెవార్ దీపక్…

    మొదటి పూజలు అందుకునే ఆది దేవుడైన గణపతి నిమర్జన శోభాయాత్ర ఆద్యంతం భక్తితో పరవశించేలా ఉండాలి, చూసే చూపరులను ఆకట్టుకునేల కనుల పండువగా,అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించడమే ఉన్నతమైనదని భావించి నిమజ్జన శోభయాత్రను భజన సంకీర్తనలతో నిర్వహిస్తున్నాయి ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాలు..ప్రతి ఏటా ఈ గ్రామాల సంఖ్య పెరుగుతుండడం మార్పుకు సంకేతం.. గ్రామంలోని యువతే స్వయంగా ఈ మార్పుకు ప్రయత్నంచడం శుభపరిణామం.. అనతికాలం లోనే ఈ సాంప్రదాయం అన్ని గ్రామాలకు విస్తరించాలని కోరుకుందాం…


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    Message Us