
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం రాంపూర్ గ్రామం వద్ద ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు కిందికి జారిన ఘటన చోటుచేసుకుంది.. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు బస్సులో ఉన్నట్లు సమాచారం..అయితే అదృష్టవశాత్తు విద్యార్థులందరు క్షేమంగా బయటపడ్డారు.. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులను వారి ఇళ్ళకు చేరవేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు స్వల్పంగా కోతకు గురికావడంతో రోడ్డు కిందికి జారినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.. అయితే విద్యార్థులందరు క్షేమంగా బయటపడడంతో తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

