
లంబాడిలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆదివాసులు దండై కదిలారు… రాజ్ గోండ్ సేవ సమితి, ఆదివాసీ సేన, తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మాన్కాపూర్ రాయి సెంటర్ నుండి గుడిహత్నూర్ తహసీల్దార్ కార్యాలయం వరకు వందలాది సంఖ్యలో ఆదివాసులు భారీ ర్యాలీని నిర్వహించారు.. సుప్రీం కోర్టులో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలానే కేసు నడుస్తున్నందున తీర్పు వెలువడే వరకు లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువపత్రాలు ఇవ్వొద్దని తహసీల్దార్ కు మెమోరాండం అందించారు..ఈ సందర్భంగా ఆదివాసులు మాట్లాడుతూ 1977 లో లంబాడిలను ఎస్టీ తెగలుగా నోటిఫైడ్ చేయలేదని ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దివంగత SR శంకరన్ తెలంగాణ లోని పది జిల్లాల కలెక్టర్ లకు లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని సర్క్యూలర్ జారీ చేశారాని, ఆ సర్క్యూలర్ ను సుప్రీం కోర్టుకు అందించామని, 1975-77 కాలం లో దేశంలో ఎమర్జెన్సీ ఉందని, ఆ సమయంలో దేశ వ్యాప్తంగా చట్టసభలు పనిచేయలేదని ఆ సమయంలో ఎస్టీ జాబితాలో చేర్చడం ఎలా చట్టబద్ధత వస్తుందని ప్రశ్నించారు ఆదివాసులు, చట్టభద్దత లేకుండా ఎస్టీలుగా చెలామణి అవుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఉద్యమం ఆగదని అన్నారు ఆదివాసులు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

