
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వాహంచారు..జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 13 మండలాలలో 43 బృందాలు సోదలు నిర్వహించాయి.. పట్టాపాస్ బుక్ లను ఉంచుకుని, భూములను తమ పేరుపై రాయించుకుని, బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి ..ఈ సోదాలలో వడ్డీ వ్యాపారుల నుండి వ్యవసాయ భూముల పట్టాపాసబుక్ లు, ప్రామిసినరి నోట్లు, బాండ్ లు,ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్ లు,సేల్ డిడ్ లు స్వాధీనం చేసుకున్నారు.. జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూన్న 18 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటనలో తెలిపారు…
ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు
ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
తలమడుగు పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు
బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు
బేల పోలీస్ స్టేషన్లో ఒక కేసు
ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు
గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
నార్నూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు
ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు
ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు
ఇలా జిల్లా వ్యాప్తంగా 10 పోలీస్ స్టేషన్ లలో మొత్తం 18 కేసులు నమోదయ్యాయని వివరాలను వెల్లడించారు.. అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ జనాలను మోసం చేయటం మానాలని, వడ్డీ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

