More
    HomeUncategorizedబోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ చేపట్టే సేవలకు తోడ్పాటును అందిస్తా-ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

    బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ చేపట్టే సేవలకు తోడ్పాటును అందిస్తా-ఎమ్మెల్యే అనిల్ జాదవ్..


    బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ బోథ్  రేంజ్ సౌజన్యంతో  బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ  ఆధ్వర్యంలో ఆదివారం బోథ్ మండల కేంద్రంలోని  రైతు వేదికలో ఏర్పాటు చేసిన  ఆవు పేడతో తయారుచేసిన  ప్రమిదల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యారు…
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆవుపేడతో ప్రమిదలను తయారుచేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనియమన్నారు. బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు సామాజిక, పర్యావరణ పరిరక్షణ స్పృహను కల్గివున్నారని కొనియాడారు. సొసైటీ సభ్యులు పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఈ ప్రాంత పేద పిల్లల చదువు విషయంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్న తమ దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా పరిస్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి ప్రణయ్, ఎంపీడీవో రమేష్,బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షులు షేక్ అలీ, మహిళా సంఘం అధ్యక్షురాలు వసంత, ఐకేపీ సిబ్బంది,  సొసైటీ ఉపాధ్యక్షుడు దాసరి పురుషోత్తం, సభ్యులు అబ్దుల్ రౌవుఫ్,సాయికుమార్,మునిగెల శ్రీధర్, నాగరాజ్, అల్లం సాయికృష్ణ, పాలేపు గణేష్, లింగంపల్లి సంతోష్, నాగరాజు,  రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    Message Us